News July 26, 2024
హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిందా?
HYD అభివృద్ధిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వాదోపవాదాలు చేస్తున్నారు. నగరంలో ఫ్లై ఓవర్లు తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అభివృద్ధి జరగలేదని తేల్చి చెప్పారు. దీనిపై హరీశ్ రావు ఘాటుగా బదులిచ్చారు. లోకం అంతా హైదరాబాద్‌ను మెచ్చుకుందన్నారు. కాంగ్రెస్ గజినీలకు ఇది కనిపించదని ఎద్దేవా చేశారు. మరి గత 10 ఏళ్లలో నగర అభివృద్ధిపై హైదరాబాదీగా మీ కామెంట్?
Similar News
News October 8, 2024
HYD: డిగ్రీ, పీజీ విద్యార్థులకు GOOD NEWS
అన్ని రంగాల్లో కీలకంగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) టెక్నాలజీపై ప్రభుత్వం డిగ్రీ, పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. కృత్రిమ మేధలో ఉచిత శిక్షణ అందించేందుకు HYDలో ‘నెక్ట్స్ వేవ్’ స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క ఏడాదిలో కనీసం లక్ష మందికి శిక్షణ అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. వర్క్‌షాప్ ద్వారా 2-3 నెలల ట్రైనింగ్ అందిస్తారు. మొదట HYD కాలేజీల్లో దీన్ని అమలు చేస్తారు.
News October 8, 2024
HYD: రూ.1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్
తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ.1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిమాండ్‌ను బట్టి దళారులు ఈ ధరలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ముడి సరుకును ల్యాబ్‌కు తరలించి ఎండీఎం తయారీకి ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో ఎంఫిటమైన్ తయారీ చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి.
News October 7, 2024
HYD: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!
HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్ PS పరిధిలో <<14294955>> రోడ్డు ప్రమాదంలో<<>> చనిపోయిన ఇద్దరి వివరాలు పోలీసులు తెలిపారు. షేక్ మదీనా బాషా (కుడి) TGRTCలో అసిస్టెంట్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అన్నోజు శ్రావణ కుమార చారి (ఎడమ) TKR కాలేజ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. మదీనా బాషా TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రావణ లిఫ్ట్ అడిగాడు. వీరి మరణవార్తతో కుటుంబపెద్దలను కోల్పోయామని వారు రోదిస్తున్నారు.