News September 13, 2024
హైదరాబాద్‌లో ఇరాన్ టూరిజం శాఖ రోడ్‌షో

భారత్-ఇరాన్ పర్యాటక సహకారమే లక్ష్యంగా ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో సాంస్కృతిక, చారిత్రక, సహజ వైవిధ్యాన్ని తెలిపేలా ఇరాన్ టూరిజం శాఖ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో గురువారం రోడ్‌షో నిర్వహించింది. ఇరాన్ టూరిజం ఉపమంత్రి అలీ అస్గర్ షాల్బాఫియాన్, తెలంగాణ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జనవరి 2024 నుంచి భారతీయులకు ప్రతీ 6 నెలల్లో 15 రోజుల పాటు వీసా రహిత ప్రయాణాన్ని ఇరాన్ ప్రకటించింది.
Similar News
News December 1, 2025
HYD: కరెంటు బిల్లే క్రెడిట్ స్కోరు.!

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణను ప్రకటించనుంది. ‘రుణ చరిత్ర లేని’ ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB) ఏర్పాటు కానుంది. ఈ సంస్థ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు వంటి చెల్లింపుల రికార్డులను పరిశీలించి ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లక్షలాది మందికి రుణాలు అందించే అవకాశం ఉందని అధికారులు Way2Newsకు తెలిపారు.
News December 1, 2025
HYD: విమానంలో మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడు. విమానం హైదరాబాద్ చేరుకోగానే RGIA పోలీసులు కేరళకు చెందిన ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు, లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 1, 2025
HYD: ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ పేరుతో రూ.1.87కోట్ల మోసం

స్టాక్ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్‌కు చెందిన ముఖేశ్ పాఠక్‌పై సీసీఎస్ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్ తెలిపింది.


