News April 18, 2024
హైదరాబాద్‌లో ఇవి FAMOUS

చారిత్రక సంపదకు పుట్టినిల్లు మన హైదరాబాద్. నగర నిర్మాణ చిహ్నానికి చార్మినార్, 12వ శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోట, రాజభవనాలకు కేరాఫ్‌గా చౌమహల్లా ప్యాలెస్, మాల్వాల ప్యాలెస్‌లు ఉన్నాయి. కళా ప్రపంచంలో సలార్‌జంగ్ మ్యూజియం ఓ మాస్టర్ పీస్. ట్యాంక్‌బండ్, కుతుబ్ షాషీ టూంబ్స్, మక్కా మసీద్, తారామతి బరాదారి, తోలి(డమ్రి) మసీద్, పైగా టూంబ్స్, స్పానీష్ మసీద్ HYD చరిత్రకు ఆనవాళ్లు. నేడు World Heritage Day
Similar News
News November 20, 2025
‘ఇబ్రహీంపట్నం ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు’

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం SC బాయ్స్ హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతిరోజూ అందిస్తోన్న అన్నం సరిగా ఉడకకపోవడం, గింజలు గట్టిగా ఉండటం, రుచి తగ్గిపోవడం, కొన్నిసార్లు తినడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇదొక చిన్న సమస్యగా కాకుండా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశమని, కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.
News November 19, 2025
ప్రణాళికలు సిద్ధం చేసుకుని చీరలు పంపిణీ చేయాలి: రంగారెడ్డి కలెక్టర్

రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకొని పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. చీరల పంపిణీ కార్యక్రమం విషయం స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం అందించి, వారిని తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు.ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
News November 19, 2025
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. అక్రిడియేషన్ కార్డుల జాప్యం, జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50% ఫీజు రాయితీ అమలు చేయకపోవడం, పలు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని ఆందోళనకారులు పేర్కొన్నారు.


