News February 16, 2025

హైదరాబాద్‌లో ఎన్నికల సందడి

image

HYDలో ఎన్నికల సందడి మొదలైంది. GHMCలో ఈ నెల 25న 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. BRS, BJP ఆసక్తి చూపకపోవడంతో ఎక్కువగా ఏకగ్రీవం కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్, MIM నుంచి ఎక్కువ మంది సభ్యులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఇక రానున్న బల్దియా ఎన్నికల‌పై INC పెద్దలు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం విశేషం. ఇప్పటివరకు BRS 2, INC నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు.

Similar News

News December 13, 2025

భూపాలపల్లి: రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

image

పలిమెల, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.

News December 13, 2025

వంటింటి చిట్కాలు

image

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.

News December 13, 2025

నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

image

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.