News February 16, 2025

హైదరాబాద్‌లో ఎన్నికల సందడి

image

HYDలో ఎన్నికల సందడి మొదలైంది. GHMCలో ఈ నెల 25న 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. BRS, BJP ఆసక్తి చూపకపోవడంతో ఎక్కువగా ఏకగ్రీవం కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్, MIM నుంచి ఎక్కువ మంది సభ్యులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఇక రానున్న బల్దియా ఎన్నికల‌పై INC పెద్దలు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం విశేషం. ఇప్పటివరకు BRS 2, INC నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు.

Similar News

News March 28, 2025

రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుండటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం చుక్కాపూర్లో 39.6℃, మాడ్గుల్, మంగళ్‌పల్లె 39.5, మీర్‌ఖాన్‌పేట 39.4, కందవాడ 39.3, కడ్తాల్, కాసులాబాద్ 39.2, ఇబ్రహీంపట్నం, ఎలిమినేడు 39.1, రాజేంద్రనగర్, చందనవెల్లి 39, ముద్విన్, తాళ్లపల్లి, దండుమైలారం 38.9, మొగలిగిద్ద 38.8, యాచారం, షాబాద్ 38.7, కేశంపేట 38.6, వెల్జాల 38.5, తట్టిఅన్నారం 38.4℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 28, 2025

HYD: కూతురిని హత్య చేసిన తల్లి

image

కూతురిని తల్లి హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి దంపతులు. భర్త మణికి 2 మూత్రపిండాలు పాడవగా.. 15 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆమె పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు ఉంటాయని భావించి మంగళవారం నీళ్ల బకెట్‌లో వేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

News March 28, 2025

హైదరాబాద్‌లో ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు

image

రంజాన్ చివరి శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా రానుండటంతో పోలీసులు HYDలో ఆంక్షలు విధించారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చే రోడ్లన్నింటినీ ఉ.8 నుంచి సా.4వరకు మూసేస్తున్నారు. చార్మినార్‌కు వచ్చే నయాపూల్ నుంచి మదీనా, శాలిబండ- హిమ్మత్‌పుర, చౌక్‌మైదాన్-మొగల్‌పుర, మీర్ఆలం మండీ/బీబీ బజార్, మూసాబౌలి- మోతీహాల్, గన్సీబజార్- హైకోర్టు రోడ్డుకు వాహనాలు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!