News February 5, 2025

హైదరాబాద్‌లో ఎవరి బలం ఎంత?

image

HYDలో ఎవరి బలం ఎంత ఉందో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. GHMC స్టాండిండ్ కమిటీ సభ్యుల్లో ఏ పార్టీకి ఎంత మంది ఓటేస్తారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. INC 24, MIM 41, BJP 41, BRS 40 మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీ కోసం 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికవుతారో అనేది ఆసక్తిని రేపుతోంది.

Similar News

News February 7, 2025

CSR సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

image

ఈనెల 16న శిల్పకళావేదికలో జరిగే సౌత్​ ఇండియా CSR​ సమ్మిట్​ పోస్టర్​‌ను మంత్రి శ్రీధర్​ బాబు ఆవిష్కరించారు. సమ్మిట్‌లో వెయ్యి కార్పొరేట్​ సంస్థలు, 2వేల మంది NGO’S​, పబ్లిక్​ ఎంటర్​ ప్రైజేస్‌ల ప్రతినిదులు పాల్గొంటారని తెలిపారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి 50 కేటగిరిల్లో సేవా అవార్డులు ఇవ్వనున్నారు. సమ్మిట్ లైసెన్సీ వినీల్​ రెడ్డి, TDF​ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్​ రెడ్డి ఉన్నారు.

News February 7, 2025

బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచకపోతే రేవంత్ చిట్టా విప్పుతా: కృష్ణయ్య

image

బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచకపోతే సీఎం రేవంత్ రెడ్డి చిట్టా విప్పుతామని రాజ్యసభ ఎంపీ ఆర్?కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారని కామెంట్ చేశారు. బీసీల అణచివేతకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నారన్నారు.

News February 7, 2025

నార్సింగిలో బాలికపై సామూహిక అత్యాచారం

image

రాజేంద్రనగర్‌లోని నార్సింగి PS పరిధి దారుణం జరిగింది. హైదర్‌షా కోట్‌లో 4 రోజుల క్రితం బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని బాధితులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!