News February 4, 2025
హైదరాబాద్‌లో కడప వాసి మృతి
హైదరాబాద్‌లో భవనం పైనుంచి పడి కడపకు చెందిన సైట్ ఇంజినీర్ మిథున్ కుమార్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కొల్లూరు పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. అఫ్తా గ్రీన్ హోమ్‌లో నిర్మాణంలో ఉన్న భవనం 13వ అంతస్తు నుంచి మిథున్ కుమార్ రెడ్డి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి సిబ్బంది హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. కేసు నమోదైంది.
Similar News
News February 4, 2025
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటా: కడప ఎస్పీ
జిల్లాలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు ఎటువంటి ఆపద కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏపీ పోలీస్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ డైరీ -2025ను ఎస్పీ ఆవిష్కరించారు. ఏఎస్పీ ప్రకాశ్ బాబు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
News February 4, 2025
నేడు కడపకు వస్తున్న ఇంఛార్జి మంత్రి సవిత
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇంఛార్జి మంత్రి సావిత్రమ్మ నేడు కడపకు వస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జరిగే జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
News February 3, 2025
గజ వాహనంపై భక్తులకు కడప రాయుడి దర్శనం
తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని గజవాహనంపై అలంకరించి నాలుగు మాడవీధుల్లో విహారం చేశారు. నేడు స్వామివారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు రథంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.