News January 24, 2025

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌ కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్‌లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149‌గా నిర్ణయించారు. మీ ఏరియాలో‌ ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT

Similar News

News January 26, 2025

బేగంపేట్ ప్రజాభవన్‌లో గణతంత్ర వేడుకలు

image

గణతంత్ర దినోత్సవం ప్రజా భవన్‌లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసుల గౌరవార్థం స్వీకరించి పాల్గొని జెండా ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు, ప్రజాభవన్ సిబ్బంది పాల్గొన్నారు.

News January 26, 2025

త్రివర్ణ శోభతో జంట నగరాలు

image

గణతంత్ర దినోత్సవం రైల్వే స్టేషన్‌లకు కొత్త శోభను తెచ్చిపెట్టింది. నిన్న సికింద్రాబాద్ రైల్ నిలయం, సికింద్రాబాద్ సౌత్ సెంటర్ రైల్వే స్టేషన్‌లను 3 రంగుల జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేష త్రివర్ణ శోభతో జిగేల్ మంటున్నాయి. ఈ అలంకరణ ప్రయాణికులను ఆకట్టుకుంది. 

News January 26, 2025

HYD: భారీగా తగ్గిన టమాటా ధరలు

image

టమాటా ధరలు మునుపెన్నడూ లేని విధంగా పడిపోయాయి. జంట నగరాల అవసరాలకు సరిపడా టమాట ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుతం గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, బోయిన్‌పల్లి, మాదన్నపేట మార్కెట్లలో టమాటా ధరలు భారీగా తగ్గాయి. హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ.3 నుంచి రూ.8 వరకు ఉండగా.. రిటైల్ మార్కెట్లో కిలో రూ.7 నుంచి రూ.10 వరకు పలుకుతోంది. మీ ప్రాంతంలో ఎంతకు విక్రయిస్తున్నారు.