News January 24, 2025
హైదరాబాద్లో చికెన్ ధరలు

హైదరాబాద్లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149గా నిర్ణయించారు. మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT
Similar News
News January 9, 2026
HYD: 2 రోజులు వాటర్ బంద్

నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం సా.6 వరకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలినగర్, నాగోల్, బడంగ్ పేట, ఆదిభట్ల, బాలాపూర్ రిజర్వాయర్, నాచారం, తార్నాక, లాలాపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, శాస్త్రిపురం నేషనల్ పోలీస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.
News January 8, 2026
తలకొండపల్లి: రేపటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

తలకొండపల్లి మండలం వెల్జాల్లో వెలసిన వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీనివాసమూర్తి చెప్పారు. ఉత్సవాలలో భాగంగా 9న గణపతి పూజ, లక్ష్మీనరసింహస్వామి అభిషేకం, లక్ష పుష్పార్చన, 10న పుష్పార్చన, అభిషేకం, బండ్లు తిరుగుట, 11న మధ్యాహ్నం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, చక్రతీర్థం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News January 8, 2026
రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్-2 మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్

నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్న వ్యక్తులకు సహకరించిన రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2 కె.మధుసూధన్ రెడ్డిని రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. అంతే కాదు.. మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దీన్ని సీరియస్గా తీసుకున్నారు.


