News January 24, 2025
హైదరాబాద్లో చికెన్ ధరలు

హైదరాబాద్లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149గా నిర్ణయించారు. మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT
Similar News
News September 19, 2025
ఏలూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

ఏలూరు రూరల్ పరిధిలోని ఓ దాబాలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. నిర్వహకుడితో పాటు ఇద్దరు విటులను, మరో ఇద్దరి యువతులను అరెస్టు చేశామని SI నాగబాబు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వహకుడిపై కేసు నమోదు చేశారు.
News September 19, 2025
ఖమ్మం: ఇస్రోకు సత్తుపల్లి ఖనిజాలు..!

సత్తుపల్లిలో అరుదైన ఖనిజాలున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష పరిశోధన పరికరాల తయారీకి ఉపయోగపడే స్కానియం, స్ట్రాన్షియం, నియోడయోమియం వంటి ఖనిజాల కోసం సింగరేణితో ఇస్రో చేతులు కలిపింది. ఇక్కడ బొగ్గుతోపాటు సిలికా, ఐరన్, బేకాసైట్ ఖనిజాలు కూడా లభ్యమవుతున్నాయి. ఈ సహకారం అంతరిక్ష పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సింగరేణి ఖనిజాల తవ్వకంలోకి ప్రవేశించడం శుభపరిణామం.
News September 19, 2025
అమెరికాలో గొడవ.. పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి

మహబూబ్నగర్ (TG)కు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. MS చేసేందుకు 2016లో USకు వెళ్లిన అతడు జాబ్ లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ‘రూమ్మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని SEP 3న కాల్ వచ్చింది. నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేస్తున్నాడు. కంట్రోల్ చేసేందుకు కాల్పులు జరిపాం. గాయాలతో అతడు మరణించాడు’ అని పోలీసులు తెలిపారు.