News May 26, 2024
హైదరాబాద్‌లో జూన్ 1 నుంచి మాన్సూన్ టీమ్స్

జూన్ 1 నుంచి అక్టోబరు నెలాఖరు వరకు వర్షాకాల అత్యవసర బృందాల(మాన్సూన్ టీమ్స్)ను రంగంలోకి దింపేందుకు GHMC టెండర్లు పిలిచింది. రూ.36.98 కోట్లతో 64 సంచార బృందాలు, 104 మినీ అత్యవసర బృందాలు, 160 స్టాటిక్ బృందాలతో పని చేయించనున్నట్లు బల్దియా వెల్లడించింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా, ప్రతి చెరువుకు ఓ ఇంజినీరును బాధ్యులుగా ఉంటారని అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News February 8, 2025
హుస్సేన్‌సాగర్‌కు కొత్త అందాలు

హుస్సేన్‌సాగర్ చుట్టూ 10.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ స్కైవాక్, సైకిల్ ట్రాక్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. దీన్ని నిర్మిస్తే అతిపెద్ద సైకిల్ ట్రాక్, స్కైవాక్ నిర్మించిన నగరంగా HYD నిలువనుంది. పదిన్నర కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌తో సాగర్‌కు కొత్త అందాలు దిద్దనున్నారు. కామర్షియల్‌కి ప్రత్యేక జోన్లు, ట్రాక్ వెంట ఓపెన్ థియేటర్లు, ఫుడ్ కోర్టులకు దాదాపు రూ.500 కోట్లు అంచనా వేశారు.
News February 8, 2025
కాప్రా: బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో 2022లో పెన్షన్ కోసం పలువురు వృద్ధులు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 191 మంది పెన్షన్ మంజూరైనట్లు సర్కిల్ అధికారులు జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో 32 మంది మృతుల పేర్లు ఉన్నాయని కాప్రా సర్కిల్ అధికార వర్గాల సమాచారం. బతికి ఉన్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చనిపోయాక మంజూరు కావడం మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది.
News February 8, 2025
HYD: ఆలుమొగల పంచాయితీలకు కారణాలు అవే..!

HYDలో ఆలుమొగల మధ్య గొడవలు కుటుంబాలలో చిచ్చురేపి, ప్రాణాలు తీస్తున్నాయి. నిత్యం సగటున ఒక్కో PSకు 15 నుంచి 20 వరకు దంపతుల తగాదాల ఫిర్యాదులు వస్తున్నాయి. మానసిక క్షోభ, ఆవేదన, అక్రమ సంబంధాలు, అనుమానం, క్షణికావేశంతో విచక్షణ కోల్పోతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఒక్క ఏడాదిలో దాదాపు 40 మంది గృహిణులు ఆత్మహత్యకు గురయ్యారు, 54 మంది ఆత్మహత్యకు పాల్పడ్డట్లు రిపోర్టు చెబుతోంది.