News November 8, 2024
హైదరాబాద్లో డేంజర్ జోన్లు ఇవే!

గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) సాధారణ స్థాయికి మించి నమోదు అవుతున్నట్లుగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. సనత్నగర్లో 168, కోకాపేట 114, న్యూమలక్పేట 102, జూపార్కు 111, HCU 108, బొల్లారంలో 118 AQI నమోదయినట్లుగా పేర్కొంది. AQI స్థాయి 100కు మించి ఉంటే శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారికి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
SHARE IT
Similar News
News November 19, 2025
HYD: రాహుల్ సిప్లిగంజ్ వివాహం.. సీఎంకి ఆహ్వానం

రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహానికి నవంబర్ 27న పెద్దలు ముహూర్తం నిశ్చియించారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించారు.
News November 19, 2025
HYD: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై సంధ్య శ్రీధర్రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం హైడ్రా తీరుపై సీరియస్ అయింది. కూల్చివేతలకు అనుమతి ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ‘కోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు’ అని హైడ్రాను నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.
News November 19, 2025
HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.


