News July 13, 2024

హైదరాబాద్‌లో తగ్గిన క్రైమ్ రేట్

image

నగరంలో శాంతిభద్రతలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు పోలీస్ ‌గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023-24కి సంబంధించి తొలి ఆరు (జనవరి నుంచి జూన్) నెలల కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హత్యలు: 2023‌‌లో 47, 2024లో 45
మర్డర్‌ అటెంప్ట్‌లు: 2023లో 155, 2024లో 145
రోడ్డు ప్రమాదాలు: 2023లో 209, 2024లో 160 యాక్సిడెంట్‌ కేసులు నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
SHARE IT

Similar News

News October 21, 2025

HYD: సదర్.. దున్నరాజుకు రూ.31 వేల మద్యం

image

ముషీరాబాద్‌లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కేరళ నుంచి తెచ్చిన 2,500 కిలోల ‘దున్నరాజు’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్సవంలో యాదవులు రూ.31,000 విలువైన ‘రాయల్ సెల్యూట్’ బాటిల్‌ను దున్నరాజుకు తాగించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో సదర్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి.

News October 21, 2025

HYD: పోలీస్ బాస్.. మీ సేవలకు సెల్యూట్

image

నిజాయితీకి ప్రతీక, ధైర్యానికి పర్యాయపదం ఉమేశ్ చంద్ర ఐపీఎస్. వరంగల్‌లో ASPగా నక్సలైట్లను అణచివేశారు. కడప SPగా ఫ్యాక్షన్‌ను కట్టడి చేసి ‘కడప సింహం’గా ఖ్యాతి గడించారు. కరీంనగర్‌లో శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. చివరగా AIGగా సేవలందించారు. ప్రజల కోసం పోరాడి ‘ప్రజల పోలీస్’గా పేరుగాంచారు. ఆయన బదిలీ వార్తపై ప్రజలు రోడ్డెక్కి కన్నీరు పెట్టారు. 1999 SEP 4న HYD SRనగర్‌లో నక్సలైట్ల దాడిలో కన్నుమూశారు.

News October 21, 2025

HYD: పోలీస్ శాఖలో ‘టైగర్ జిందా హై’!

image

నిజాయితీ, అంకితభావంతో పనిచేసిన IPSలో KS వ్యాస్ ఒకరు. ASPగా కెరీర్ ప్రారంభించిన ఆయన నిజామాబాద్, నల్గొండ, విజయవాడలో SPగా పనిచేశారు. HYD ట్రాఫిక్‌లో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. మావోయిస్టుల అణచివేత కోసం గ్రేహౌండ్స్‌ను స్థాపించారు. KS వ్యాస్‌ మీద కక్ష పెంచుకున్న నక్సల్స్ జనవరి 27, 1993న LB స్టేడియంలో కాల్చిచంపారు. కానీ, ఒక సీన్సియర్ IPS ఆఫీసర్‌గా పోలీస్ శాఖలో నేటికీ సజీవంగా ఉన్నారు.‘టైగర్ జిందా హై’!