News June 28, 2024
హైదరాబాద్లో తగ్గిన చికెన్ ధరలు

హైదరాబాద్లో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కిలో రూ. 250కి పైగా విక్రయించారు. శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫాంరేటు రూ. 110, రిటైల్ రూ. 132, విత్ స్కిన్ కిలో రూ. 191, స్కిన్లెస్ రూ. 218 నుంచి రూ. 230 మధ్య అమ్ముతున్నారు. ధరలు తగ్గడంతో మాంసం విక్రయాలు పెరిగే అవకాశం ఉందని HYD పార్శిగుట్టలోని ఓ వ్యాపారి తెలిపాడు. బోనాల సీజన్ కావడంతో ఈ ఆదివారం నుంచే గిరాకీ ఉంటుందన్నారు.
Similar News
News December 7, 2025
వామ్మో! HYDలో భారీగా పెరిగిన ధరలు

నగరంలో గుడ్ల ధరలు కొండెక్కాయి. విడిగా కొంటే గుడ్డు రూ.8- 9 వరకు అమ్ముతున్నారు. డజన్ రూ.90కి, ట్రే 220- 230 వరకు విక్రయిస్తున్నారు. ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్లో ఎగ్ డీలర్స్ వద్ద స్టాక్ లేకపోవడం ధరల ఎఫెక్ట్ కనిపిస్తోంది. వర్కవుట్స్ చేసే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోటీన్ సోర్స్ గుడ్డే..త్వరగా కర్రీ చేసుకునే బ్యాచిలర్లు ఇబ్బందిగానే మారిందంటున్నారు. 3వారాలుగా గుడ్ల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
News December 7, 2025
నగరంలో NAVY బ్యాండ్ షో.. ఫ్రీ ఎంట్రీ

ఇండియన్ నేవీ డే ఉత్సవాల్లో భాగంగా NAVY సాగర శక్తిని చాటిచెప్పే సంగీత విభావరి హైదరాబాద్లో జరగనుంది. తూర్పు నౌకాదళ కమాండ్ (విశాఖపట్నం) నుంచి వచ్చిన 26 మంది సభ్యుల నేవీ బ్యాండ్, డిసెంబర్ 8న సా.6 గంటలకు కొండాపూర్లోని సరత్ సిటీ మాల్లో గంట పాటు సంగీత ప్రదర్శన ఇవ్వనుంది. 1971 యుద్ధ విజయ స్ఫూర్తిని గుర్తుచేస్తారు. ఈ ఉచిత కార్యక్రమానికి ప్రజలందరూ ఆహ్వానితులే.
News December 7, 2025
చర్లపల్లి స్టేషన్లో రూ.91.92 కోట్లతో భారీ ప్రాజెక్ట్!

చర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు భాగ అభివృద్ధి, ప్రవేశమార్గాల కోసం TSIIC Rs 91.91 కోట్లు కేటాయించింది. ఈ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. లెఫ్ట్/రైట్ వింగ్ అమేనిటీ భవనాలు, 2×11.5మీ. క్యారేజ్వే రోడ్లు, సర్వీస్ రోడ్లు, 11kV సబ్-స్టేషన్, 1500KVA DG సెట్, 1250KVA ట్రాన్స్ఫార్మర్లు, 250 KLD వాటర్ ట్యాంక్, 500 KLD STP, ల్యాండ్స్కేపింగ్తో సహా ఈ ప్రాజెక్టు చర్లపల్లిని కీలక రవాణా కేంద్రంగా మార్చనుంది.


