News February 6, 2025

హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గాయి. వారం రోజుల క్రితం కిలో రూ. 220పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ. 195 నుంచి రూ. 206, విత్ స్కిన్ రూ. 180 నుంచి రూ. 190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్‌ వల్ల కోళ్లు చనిపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

Similar News

News November 15, 2025

WGL: ఉపాధ్యాయుల్లో ‘టెట్’ టెన్షన్!

image

ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇన్ సర్వీసు టీచర్లలో ఆందోళన నెలకొంది. పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 వేల మందిలో 90% మందికి టెట్ తప్పనిసరి కావడంతో ఉపాధ్యాయ సంఘాలు మినహాయింపు కోసం ఎన్సీటీఈ, ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

News November 15, 2025

IPL: మ్యాక్సీని వదిలేసిన పంజాబ్!

image

ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోకుండా పంజాబ్ కింగ్స్ విడిచిపెట్టింది. ఆయనతో పాటు ఆరోన్ హార్డీ, కుల్‌దీప్ సేన్, విష్ణు వినోద్‌ను కూడా విడుదల చేసింది. IPLలో విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన మ్యాక్సీ గత కొన్ని సీజన్లుగా తేలిపోతున్నారు. ఈ ఏడాది టోర్నీలో 7 మ్యాచులాడి కేవలం 47 పరుగులే చేశారు. దీంతో మ్యాక్సీని భారంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News November 15, 2025

పాకాల: ధాన్యం కొనుగోళ్లలో కఠిన నిబంధనలు..!

image

వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకుండానే రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. జల్లెడ వేసిన ధాన్యానికే టోకెన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో రైతులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. తాలు, మట్టి, పాడైన ధాన్యం 5% లోపే ఉండాలన్న నిబంధనలు, మిల్లర్ల కేటాయింపు ఆలస్యం రైతులకు తలనొప్పిగా మారాయి. నిబంధనలు పాటించకపోతే కొనుగోలు చేయబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.