News February 6, 2025

హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గాయి. వారం రోజుల క్రితం కిలో రూ. 220పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ. 195 నుంచి రూ. 206, విత్ స్కిన్ రూ. 180 నుంచి రూ. 190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్‌ వల్ల కోళ్లు చనిపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

Similar News

News March 7, 2026

సింగరేణి సీఎండీని కలిసిన భద్రాద్రి కలెక్టర్ అంకిత్

image

భద్రాద్రి కలెక్టర్ అంకిత్ శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సీఎండీ డా.జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, పరస్పర సహకారంపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ కూడా పాల్గొన్నారు.

News March 7, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
* కృష్ణ యూనివర్సిటీ డిగ్రీ 3,4 సెమిస్టర్ రీవాల్యూషన్ ఫలితాలు విడుదల
* ఉయ్యూరులో విద్యార్థుల మెడలో చెప్పుల దండ
* విజయవాడలో పోలీసులపై కాల్పులకు యత్నం.!
* కృష్ణాజిల్లాలో అంగన్వాడీ పోస్ట్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడలో మూడు నెలలపాటు ఉచిత వెబ్ డెవలపర్ శిక్షణ
* మొవ్వ: బావిలో పడి మహిళా కూలి మృతి

News March 7, 2026

అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. మంత్రి సంతాపం

image

AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ X వేదికగా స్పందించారు. అన్వర్ జాన్ మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.