News April 24, 2024
హైదరాబాద్లో తగ్గిన రిజిస్ట్రేషన్లు

HYDలో మార్చి నెలలో 6,416 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలో 7,135 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. 10% తగ్గినట్లు రియల్ ఎస్టేట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లాలో 46%, మేడ్చల్ మల్కాజిగిరిలో 40%, హైదరాబాదులో 10%, సంగారెడ్డిలో ఒక శాతం ఉన్నట్లు వెల్లడించింది.
Similar News
News October 30, 2025
HYD: 1987 నాటి రైలు ఎలా ఉండేదో తెలుసా?

1987 నాటి ఈ అందమైన ఫొటో నాటి రైల్వే వ్యవస్థను గుర్తుచేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్కి అకోలా జంక్షన్ నుంచి వచ్చిన ప్రయాణికులను YP 2865 లోకోమోటివ్ రైలు పొగలు కక్కుతూ, కూ.. అంటూ కూతవేస్తూ లాగేది. 1960ల చివర్లో టాటా కంపెనీ టెల్కో, జంషెడ్పూర్లో ఈ YP ఇంజిన్ తయారు చేసిందని IRAS అనంత్ తెలిపారు. తను ఉద్యోగంలో చేరిన సమయంలో రైల్వే అనుభూతులను గుర్తు చేసుకున్నారు.
News October 30, 2025
HYD: గర్ల్ఫ్రెండ్పై యువకుడి పైశాచికం

గర్ల్ఫ్రెండ్పై యువకుడి పైశాచిక తీరు ఒళ్లు గుగురుపొడిచేలా చేసిన ఘటన పంజాగుట్ట PSలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. గుంటూరు యువతి సోమాజిగూడలో ఉంటోంది. నిందితుడు భానుప్రకాశ్, యువతి ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 26న ఆమె రూమ్కి వెళ్లాడు. లైంగికదాడి చేసి గోర్లు పీకి, కత్తెరతో ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా రిమాండ్కు తరలించారు.
News October 30, 2025
HYD: BJP చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందే: మహేశ్

బీజేపీ చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని కలలు కన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరించే పార్టీ.. మైనార్టీకి మంత్రి పదవి ఇస్తే తప్పేంటి? అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీజేపీకి ఫ్యూచర్లో ఏ పనిలేక చివరికి చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని ఘాటుగా విమర్శించారు.


