News September 5, 2024

హైదరాబాద్‌లో తూగో జిల్లాకు చెందిన మహిళ దుర్మరణం

image

రాయవరం మండలం వెదురుపాకకు చెందిన నాగవల్లి (24) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందింది. బోరబండ పోలీసులు ప్రకారం.. విజయభాస్కర్, నాగవల్లి దంపతులు సనత్‌‌‌‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. స్వగ్రామానికి వెళ్లి బుధవారం ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద బస్సు దిగారు. ఆటో కోసం ఎదురు చూస్తుండగా కారు వేగంగా వచ్చి దంపతులను ఢీకొట్టింది. ప్రమాదంలో నాగవల్లి అక్కడిక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేశారు.

Similar News

News September 16, 2024

తూ.గో: పెద్దాపురంలో వికసించిన బ్రహ్మ కమలం

image

హిమాలయ పర్వత శ్రేణుల్లో పెరిగే బ్రహ్మ కమలం పెద్దాపురంలో కొత్తపేట రామాలయం వీధికి చెందిన ఆదిరెడ్డి విజయలక్ష్మి ఇంటి పెరటిలో ఆదివారం వికసించింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూసే బ్రహ్మ కమలం మొక్కను ఆమె తులసి కోటలో నాటగా బ్రహ్మ కమలం వికసించటంతో ఆదివారం ఈ కమలాన్ని చూడడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు తరలి వచ్చారు.

News September 15, 2024

దేవీపట్నం: అనారోగ్యంతో పాఠశాల హెచ్ఎం మృతి

image

దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ఎంపీపీ యూపీ పాఠశాల హెడ్ మాస్టర్ కొమరం ధర్మన్న దొర (45) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. కిడ్నీ, షుగర్ వ్యాధులతో రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. స్వగ్రామం పాముగండి గ్రామానికి చెందిన ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News September 15, 2024

దివాన్ చెరువు ప్రాంతంలో పులి కదలికలు: FRO భరణి

image

దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు ట్రాప్ కెమెరాలో రికార్డు అయ్యాయని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి తెలిపారు. చిరుత ప్రస్తుతం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నామన్నారు. పులిని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని, దాన్ని కచ్చితంగా పట్టుకుంటామన్నారు.