News August 4, 2024

హైదరాబాద్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే హైదరాబాదీ‌లు ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. ఫెయిర్ వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
Happy Friendship Day

Similar News

News October 19, 2025

HYD: మంత్రి పేషీ అడ్డాగా ఐటీ ప్రాజెక్ట్‌ పేరుతో మోసం

image

సచివాలయం ఐటీ మంత్రి పేచీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్‌ మంజూరు చేస్తామంటూ మోసం చేశారు. మియాపూర్‌ ఐటీ ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు. మంత్రి ఓఎస్‌డీ లెటర్‌హెడ్‌లు, నకిలీ పత్రాలు చూపి మోసగాళ్లు నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరిగురిపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను సీసీఎస్‌కు బదిలీ చేశారు.

News October 19, 2025

జూబ్లీహిల్స్: 8 పోలీస్ స్టేషన్లు.. 234 ఆయుధాలు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 234 మంది వద్ద లైసెన్డ్స్ ఆయుధాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా వాటిని స్థానిక PSలలో డిపాజిట్ చేయాలి. అయితే ఇప్పటి వరకు 196 మంది తుపాకులను పోలీసులకు అందజేశారు. పంజాగుట్ట PS పరిధిలో 26 ఉండగా 19, మధురానగర్‌లో 23 ఉండగా 17, బోరబండలో 37కు 27, జూబ్లీహిల్స్‌లో 27కు 23, ఫిలింనగర్‌లో 6కు 5, టోలిచౌకిలో 106కు 96, సనత్‌నగర్‌లో 2కు 2, గోల్కోండ పరిధిలో 7ఉండగా 7 ఆయుధాలను అప్పగించారు.

News October 19, 2025

HYD: దీపావళి వేళ.. గుర్తుంచుకోండి ఈ నంబర్లు

image

దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాలుస్తాం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరిగినా అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ కోరారు. 24 గంటల పాటు సిబ్బంది విధి నిర్వహణలో ఉంటారని పేర్కొన్నారు.  ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించి 101, 112, 9949991101 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని కోరారు.