News June 15, 2024

హైదరాబాద్‌లో నేటి నుంచి డయల్ యువర్ ఎండి

image

జలమండలి పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గతంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు సమస్యలను తెలుసుకుంటామన్నారు. మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ ఇతర సమస్యలపై 23442881, 23442882, 23442883 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.

Similar News

News January 15, 2025

HYD: పోరాట యోధుడి జయంతి నేడు

image

1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్‌ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.

News January 15, 2025

సంక్రాంతి వేళ సైబర్ మోసాలతో జాగ్రత్త: శిఖాగోయల్

image

సంక్రాంతి పండుగవేళ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. సైబర్ నేరగాళ్లు ఫేక్ షాపింగ్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, నకిలీ వెబ్‌సైట్ల ద్వారా భారీ తగ్గింపు ధరలు చూపించి మోసం చేస్తారన్నారు. గిఫ్ట్ కార్డు మోసాలు, ఫేక్ ఈ-వ్యాలెట్లు, చెల్లింపుల కోసం నకిలీ యాప్‌లు, క్యూఆర్‌ కోడ్‌లు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. హెల్ప్ కోసం 1930కి కాల్ చేయాలన్నారు.

News January 15, 2025

HYD: అప్పటి PV సింధు ఎలా ఉన్నారో చూశారా..?

image

ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అందరికీ సూపరిచితమే. ఆమె తన క్రీడా జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్ల జ్ఞాపకాలకు సంబంధించిన ఓ ఫొటోను Xలో ప్రముఖ ఎడిటర్ ట్వీట్ చేశారు. మొట్ట మొదటిసారిగా నేషనల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్న అనంతరం సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఆమె నివాసంలో దిగిన ఫోటో ఇది. నేడు దేశానికి ఎన్నో విజయాలు సాధించి, గొప్ప పేరు తెచ్చారని పలువురు ప్రశంసించారు.