News April 11, 2024
హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

రంజాన్ సందర్భంగా నేడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి 11:30AM వరకు అమల్లో ఉంటాయన్నారు. మీరాలం ట్యాంకు ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ట్యాంకు పరిసర ప్రాంతాల్లో దారి మళ్లిస్తామన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. SHARE IT
Similar News
News November 1, 2025
BREAKING: HYD: ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై మహిళపై అత్యాచారం

HYD అమీర్పేట్ పరిధిలో ఈరోజు దారుణం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై GHMC పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం జరిగింది. బాధితురాలు ఏడుస్తూ బోరబండ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
News November 1, 2025
HYD: మోజు తీరిన తర్వాత ముఖం చాటేశాడు!

మహిళను ఓ యువకుడు మోసం చేయగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేటకు చెందిన డిగ్రీ విద్యార్థి రమేశ్(20)కు 2022లో బంజారాహిల్స్ ఇందిరానగర్లో నివసించే ఓ మహిళ(32) ఇన్స్టాలో పరిచయమైంది. ఆమెకు ఒక కూతురు ఉండగా భర్త చనిపోయాడు. ఈవిషయాన్ని ఆమె రమేశ్కు చెప్పింది. దీంతో తాను పెళ్లి చేసుకుని, తల్లీబిడ్డను బాగా చూసుకుంటానని నమ్మించాడు. మోజు తీరిన తర్వాత ముఖం చాటేయగా ఆమె PSలో ఫిర్యాదు చేసింది.
News November 1, 2025
HYD: నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇలా..

బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో నేడు రాత్రి 7 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. బోరబండ బస్టాప్ నుంచి విజేత థియేటర్, మోతీ నగర్ ఎక్స్ రోడ్, డాన్ బాస్కో స్కూల్, జనప్రియ బ్యాక్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగనుంది. బోరబండ బస్టాప్ వద్ద పబ్లిక్ మీటింగ్, జనప్రియ బ్యాక్ గేట్ శంకర్ లాల్ నగర్ వద్ద మరో బహిరంగ సభ నిర్వహించనున్నారు.


