News April 11, 2024

హైదరాబాద్‌‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

రంజాన్ సందర్భంగా నేడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి 11:30AM వరకు అమల్లో ఉంటాయన్నారు. మీరాలం ట్యాంకు ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్‌ట్యాంకు పరిసర ప్రాంతాల్లో దారి మళ్లిస్తామన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. SHARE IT

Similar News

News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 4 నుంచి 6 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2 నుంచి 3 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

News February 11, 2026

Peoples Pulse.. ఉమ్మడి రంగారెడ్డి ఎగ్జిట్ పోల్స్ ఇవే!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలకు సంబంధించి 294 వార్డుల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 104-112 వార్డులు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BRS 95-104, BJP 16-18, MIM 2-3, CPM 2-3, ఇతరులు 6-8 వార్డులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

News February 11, 2026

హైదరాబాద్: వాటర్ బోర్డ్ విస్తరణ

image

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని 2053 చదరపు కిలోమీటర్ల మేర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బాధ్యతలను ఇకపై జలమండలి (HMWSSB) చూసుకోనుంది. గ్రేటర్ పరిధి పెరిగిన నేపథ్యంలో పాత నెట్‌వర్క్‌తో పాటు కొత్త ఎస్టీపీల నిర్మాణం, నిర్వహణ అంతా బోర్డు పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం జీవో 159 జారీ చేసింది.