News November 11, 2024
హైదరాబాద్లో పెరిగిన చలి!

హైదరాబాద్లో రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉదయం చాలాచోట్ల పొగమంచు కురుస్తోంది. పటాన్చెరు, హయత్నగర్, బేగంపేట, దుండిగల్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, ఓయూలో 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కోఠి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, అబిడ్స్ వంటి ఏరియాల్లో స్వెట్టర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది.
Similar News
News October 27, 2025
బల్కంపేట ఎల్లమ్మకి కార్తీక సోమవారం పూజలు

నగరంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలలో భక్తులతో సందడి నెలకొంది. బల్కంపేట ఎల్లమ్మ క్షేత్రంలో వేకువ జామునుంచే అమ్మవారికి అభిషేకాలు చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. ఎల్లమ్మ పోచమ్మ తల్లి కరుణించవమ్మ అనే నామస్మరణతో ఆలయం మార్మోగింది. పంచ హారతుల కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి 30MIN పడుతోందని భక్తులు చెబుతున్నారు.
News October 27, 2025
HYD: నిద్రలో గురక పెడుతున్నారా?

నిద్రలో శ్వాస లోపాలపై నిమ్స్లో అవగాహన సదస్సు జరిగింది. డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప మాట్లాడుతూ.. ‘ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)ను నిర్లక్ష్యం చేయవద్దు. ఇది గుండె, మధుమేహంపై ప్రభావం చూపుతుంది’ అన్నారు. ప్రొ.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. గురక తీవ్ర వ్యాధికి సంకేతం. ఇది రక్తపోటు, గుండె జబ్బులకు దారి తీస్తుంది. పాలీ సామ్నోగ్రఫీ (Sleep Study) ద్వారా వెంటనే చికిత్స తీసుకోవాలని సూచించారు. SHARE IT.
News October 27, 2025
HYD: ఆధార్ బయోమెట్రిక్కు పెరుగుతున్న డిమాండ్

HYDలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ డిమాండ్ పెరుగుతోంది. UIDAI మైత్రివనం స్టేట్ టీం అధికారులు తెలిపినట్లుగా ఈ ప్రక్రియ సుమారు 15MINలో పూర్తవుతుంది. ప్రజలు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా వేగంగా సేవలు పొందొచ్చని సూచించారు. నగరంలోని అనేక కేంద్రాలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక కేంద్రాల్లో పరిష్కారం దొరకకపోతే మైత్రివనం ఆఫీస్ రావాలన్నారు.


