News November 11, 2024
హైదరాబాద్‌లో పెరిగిన చలి!
హైదరాబాద్‌లో రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉదయం చాలాచోట్ల పొగమంచు కురుస్తోంది. పటాన్చెరు, హయత్‌నగర్, బేగంపేట, దుండిగల్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, ఓయూలో 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కోఠి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, అబిడ్స్ వంటి ఏరియాల్లో స్వెట్టర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది.
Similar News
News November 14, 2024
HYD: మీకు చికెన్, మటన్ షాప్ ఉందా..? జాగ్రత్త..!
HYDలో వేలాదిగా చికెన్, మటన్ షాపులు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. చికెన్ కట్ చేసే సమయంలో ఈగలు వాలటం, అపరిశుభ్రత కారణంగా పలువురు అస్వస్థత గురయ్యారు.దీనిపై జీహెచ్ఎంసీ వెటర్నరీ, హెల్త్ అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. షాప్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 14, 2024
HYD: త్వరలో NIMSలో గుండె కవాటాల బ్యాంక్!
HYD NIMSలో త్వరలో గుండె కవాటాల భద్రత కోసం ప్రత్యేక బ్యాంక్ సిద్ధం అవుతుంది. చికిత్స సైతం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గుండె కవాటాలు వైఫల్యం చెందితే కృత్తిమ కవాటాలని ఆమర్చుతున్నారు. కొన్ని రోజుల తర్వాత వాటిని మళ్లీ మార్చుకోవాల్సి వస్తోంది. ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి గుండె కవాటాలను సేకరించి, బ్యాంకులో భద్రపరిచి అవసరమైన వారికి అమరుస్తారు.
News November 14, 2024
HYD: మరో 8 నెలల్లో రైల్వే స్టేషన్ల పనులు పూర్తి..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.1830.4 కోట్లతో 38 స్టేషన్లను అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేవలం రాజదాని పరిధిలోనే 12 స్టేషన్లు ఉండటం గమనార్హం. మల్కాజిగిరి, బేగంపేట, యాకుత్‌పుర, ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ల పనులు మరో 8 నెలల్లో పూర్తికానున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పూర్తయి ప్రారంభానికి సిద్ధమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.