News November 21, 2024

హైదరాబాద్‌లో పెరుగుతోన్న కాలుష్యం!

image

HYDలో వాయి కాలుష్యం పెరుగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరాల ప్రకారం.. అత్యధికంగా సనత్‌నగర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 186గా నమోదైంది. జూపార్క్-168, పటాన్‌చెరు-160, బొల్లారం-113, సెంట్రల్ యూనివర్సిటీ-98, కొంపల్లి-90, నాచారంలో 76గా ఉంది. AQI ఇండెక్స్ 100 నుంచి 200 మధ్య ఉంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇబ్బందులు పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News November 28, 2025

HYD: నేడు, రేపు డిగ్రీ కోర్సుల తుది కౌన్సిలింగ్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది దశ కౌన్సిలింగ్ ఈరోజు, రేపు నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా యూజీ కోర్సుల భర్తీకి సంబంధించింది. ప్రస్తుతం రైతు కోటాలో 22 సీట్లు, రైతు కూలీల కోటాలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News November 28, 2025

శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

image

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.

News November 27, 2025

RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

image

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్‌నగర్ నియోజకవర్గం, శంషాబాద్‌లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.