News March 12, 2025
హైదరాబాద్‌లో పోడూరు యువకుడు మృతి

పోడూరుకి చెందిన రోహిత్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. రోహిత్ తల్లి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లారు. సమాచారం తెలియడంతో ఆమె స్వగ్రామానికి బయలుదేరారు. ఇటీవల భర్త మరణించగా ఆ బాధ నుంచి తెరుకోక ముందే కొడుకు మృతితో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని బంధువులు తెలిపారు. మృతదేహన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News March 25, 2025
ప.గో: ప్రాణాలు తీస్తున్న ఈత సరదా..!

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఈత ఒక సరదా..! కానీ అదే ఈత పసిప్రాణాలను హరించేస్తోంది. ఏటా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. వేసవిలో ఒక పూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సరదాకు కాలువ గట్లు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్తున్నారు. అవి ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల తమ పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలి.
News March 25, 2025
పెంటపాడు: హత్య కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు.. జరిమానా

పెంటపాడు (M) ఆకుతీగపాడు గ్రామంలో ఆస్తి తగాదాలను కారణంగా చిన్నం శ్రీనివాస్ తన సోదరుడు వెంకటేశ్వర్లును హత్య చేశాడని స్థానిక ఎస్ఐ స్వామి తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా చిన్నం శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెం 11వ ఏడీజే కోర్టులో సోమవారం హాజరపరిచగా, నేరం నిరూపణ కావడంతో ఏడేళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ షేక్ సికిందర్ తీర్పు వెలువరించారు. పీపీ శివరామకృష్ణ సహకరించారన్నారు.
News March 25, 2025
నాటు సారా నిర్మూలన బ్రోచర్ ఆవిష్కరించిన కలెక్టర్.

నాటు సారా వలన కలిగే అనర్థాలను ప్రజలలో విస్తృత అవగాహన కల్పించి, నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదగా *”నవోదయం” -* నాటు సారా నిర్మూలన కార్యక్రమంపై అవగాహన గోడ పత్రికను, బుక్లెట్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తదితరులు పాల్గొన్నారు.