News February 26, 2026

హైదరాబాద్‌లో ప్రత్యక్ష నరకం

image

HYDలో దోమల బెడద కునుకు లేకుండా చేస్తోంది. పొగబెట్టినా పోతలే, నిద్రపోనిస్తలే.. ఆరోగ్యాలు పాడవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి, నాచారం, ఎల్బీనగర్, ఉప్పల్, కుంట్లూర్, పెద్దఅంబర్‌పేట్, మంచాల, రాజేంద్రనగర్, శంషాబాద్, షాద్‌నగర్లో ఎక్కువగా ఉంది. రాత్రంతా నరకం చూపిస్తున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేనంతగా వ్యాప్తిచెందినా యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేదా అని ప్రశ్నిస్తున్నారు.

Similar News

News April 15, 2026

HYD: ఇంటర్ మెమోల్లో తప్పులా? సరిచేసుకోండిలా!

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థులకు సూచనలు చేసింది. మెమోల్లో విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, మార్కుల వంటి వాటిలో తప్పులు దొర్లితే వెంటనే సరిచేసుకోవాలని సూచించింది. ఈ సవరణల కోసం విద్యార్థులకు 10రోజుల గడువు ఇచ్చింది. కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి అవసరమైన పత్రాలను ఇచ్చి సవరణలు చేసుకోవచ్చని, లేదా నేరుగా <<8096958096>>హెల్ప్ డెస్క్‌ను<<>> వాట్సాప్‌లో సంప్రదించాలని తెలిపింది.
SHARE IT

News April 15, 2026

HYD: అడిక్‌మెట్ మెట్టుబావికి పునర్జీవం

image

అడిక్‌మెట్‌లోని చారిత్రక మెట్టుబావికి పూర్వవైభవం లభించింది. దశాబ్దాలుగా చెత్తకుప్పగా మారిన ఈ బావిని అద్భుతంగా పునరుద్ధరించారు. టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించడంతో ప్రస్తుతం స్వచ్ఛమైన నీటి ఊటలు ఉబికి వస్తున్నాయి. బన్సీలాల్‌పేట బావి తరహాలోనే దీనిని కూడా అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. భూగర్భ జలాల పెంపునకు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.