News August 9, 2024

హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు

image

ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం బేగంపేటలోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, వివేకానంద క్లినిక్స్ నూతన శాఖను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. హాస్పిటల్లో ఆధునిక శాస్త్ర చికిత్సకు అందజేస్తున్న టెక్నాలజీ, వైద్య సేవలను పరిశీలించారు. దేశంలో రాష్ట్రం ప్రధాన ఆరోగ్య గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

Similar News

News March 9, 2026

రంగారెడ్డి జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్ 88% పూర్తి

image

రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఫోకస్ చేశారు. జిల్లాలో మొత్తం 1,97,029 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 88% రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తైనట్లుగా అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ లాంటి పథకాలు అందాలంటే రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News March 9, 2026

రంగారెడ్డి: జిల్లాలో తొలిరోజు 139 మందికి వ్యాక్సిన్

image

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలి రోజులో భాగంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 139 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో 19 మంది, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 10, రాజేంద్రనగర్‌లో 30, హయత్‌నగర్‌లో 10, శంషాబాద్‌లో 20, చేవెళ్లలో 22, షాద్‌నగర్‌లో 17, మహేశ్వరంలో ఏడుగురు బాలికలకు వ్యాక్సిన్ వేశారు.

News March 9, 2026

నగరంలో పెరుగుతున్న భగభగలు

image

నగరంలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో కనిపించే వేడి, మార్చి మొదటి వారంలోనే సెగలు పుట్టిస్తోంది. ఆదివారం నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు కాగా.. రానున్న వారం రోజుల్లో 40 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.