News March 30, 2024
హైదరాబాద్లో బలపడుతున్న కాంగ్రెస్..!

HYDలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. గత GHMC ఎన్నికల్లో 150 స్థానాలకు ఉప్పల్, ASరావునగర్లోనే విజయం సాధించిన కాంగ్రెస్ ఎట్టకేలకు లింగోజిగూడ బైపోల్లో గెలిచింది. ఇటీవల కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సైతం పార్టీని వీడారు. ఎన్నికల ముందు HYDలో బలహీనంగా ఉన్న INC అధికారం చేపట్టిన తర్వాత పుంజుకుంది. వరుస చేరికలతో గ్రేటర్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు డబుల్ డిజిట్(12)కు చేరారు. మరో 10 మంది చేరుతారని టాక్.
Similar News
News November 22, 2025
HYD: వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరం: సీపీ

వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన పోలీస్ సిబ్బంది కోసం నిర్వహిస్తున్న పాతబస్తీ పేట్ల బురుజు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరమన్నారు.
News November 22, 2025
HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.
News November 22, 2025
HYD: అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీ నటుడు నాగార్జునతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. 1970లలో సరైన వసతులు లేనప్పుడు దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను స్థాపించడం, అది హైదరాబాద్లో ముఖ్యమైన సాంస్కృతిక ల్యాండ్మార్క్గా ఎదగడంపై డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు.


