News June 25, 2024
హైదరాబాద్లో భారీ ప్రక్షాళన

HYD డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్లో ప్రక్షాళన మొదలైంది. GHMC కమిషనర్గా ఆమ్రపాలి, HMDA కమిషనర్గా సర్ఫరాజ్, జలమండలి MDగా అశోక్ రెడ్డిని నియమించింది. నగరంలోని 6 జోన్లకు కొత్తగా నలుగురు జోనల్ కమిషనర్లు వచ్చారు. కూకట్పల్లి ZCగా అపూర్వ్ చౌహన్, ఖైరతాబాద్ ZCగా అనురాగ్, ఎల్బీనగర్ ZCగా హేమంత్ పాటిల్, శేరిలింగంపల్లి ZCగా ఉపేందర్ రెడ్డిని నియమించారు.
Similar News
News September 13, 2025
రంగారెడ్డి: ఈనెల 15న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ బాల, బాలికల జట్ల ఎంపిక ఈ నెల 15న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. ఎంపికైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో జరిగే అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 55 కిలోల బరువు లోపు ఉన్న క్రీడాకారులు మాత్రమే ఈ ఎంపికకు అర్హులని పేర్కొన్నారు.
News September 13, 2025
‘గాంధీ ఆసుపత్రిని మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా’

గాంధీ ఆసుపత్రిని మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అన్నారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఆసుపత్రిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పూర్తిగా పరిశీలించి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
News September 13, 2025
దిల్సుఖ్నగర్: ఆర్టీసీ ‘యాత్రాదానం’

టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందని హైదరాబాద్-2 డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఉచిత యాత్రలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి దాతలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు విరాళాలు అందించి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.