News July 11, 2024
హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి!

హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మీరాలం చెరువు ఈస్ట్ సైడ్ చింతల్మెట్ నుంచి బెంగళూరు-హైదరాబాద్ NH-44కు అనుసంధానం చేస్తూ తీగల వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీంతో HMDA ప్లాన్ చేస్తోంది. మొత్తం 4 లైన్లు, 2.65 KM పొడవు, రెండు చోట్ల ఎంట్రీ ర్యాంపులు, ఒక చోట ఎగ్జిట్ ర్యాంప్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Similar News
News November 27, 2025
CUA మహా మాస్టర్ ప్లాన్: 27 మున్సిపాలిటీలకు కొత్త చట్టాలు!

GHMCకి అనుబంధంగా ఉన్న 27 మున్సిపాలిటీల కోసం కోర్ అర్బన్ ఏరియా (CUA) మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే HMDA మాస్టర్ ప్లాన్ 2050, 56 గ్రామాలకు FCDA ప్లాన్లు పూర్తవగా నోటిఫికేషన్ ఈ వారమే విడుదల కానుంది. ఇక CUA ప్లాన్ కోసం, ప్రత్యేకంగా జోనల్ రెగ్యులేషన్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ రూల్స్‌ను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో CMతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది.
News November 27, 2025
RR: తొలి విడతలో 7 మండలాలు.. 174 GPలు

రంగారెడ్డిలో మొత్తం 21 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. తొలి విడతలో నామినేషన్లను నేటి నుంచి స్వీకరిస్తున్నారు. కొత్తూరు(12), నందిగామ(19), కేశంపేట(29), కొందుర్గు(22), చౌదరిగూడ(24), ఫరూఖ్‌నగర్(47), శంషాబాద్ 21 జీపీలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 174 పంచాయతీల్లో 1530 వార్డులున్నాయి. 7 మండలాలకు 1530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 11న ఎన్నిక, అదే రోజు ఫలితం వెలువడనుంది
News November 27, 2025
RR: సర్పంచ్ నామినేషన్లు.. ఇవి తప్పనిసరి!

RRలోని 21 మం.లో నేటి నుంచి సర్పంచ్ నామినేషన్లు ప్రారంభంకానున్నాయి. 526 GPలున్నాయి. అభ్యర్థులు.. ✔️ 21 ఏళ్ల వయస్సు ఉండాలి.✔️ గ్రామ ఓటర్ లిస్టులో పేరు ఉండాలి.✔️ SC/ST/BC వారు కుల సర్టిఫికేట్ జతచేయాలి.✔️ డిపాజిట్ సొమ్ము చెల్లించాలి.✔️ నేర చరిత్ర, ఆస్తులు, విద్యార్హతల అఫిడవిట్ ఇవ్వాలి.✔️ ఎలక్షన్ ఖర్చుపై డిక్లరేషన్ ఇవ్వాలి.✔️ ప్రతిపాదకుడు తప్పనిసరిగా అదే వార్డు/స్థానానికి చెందిన ఓటరు కావాలి.


