News July 11, 2024
హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి!

హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మీరాలం చెరువు ఈస్ట్ సైడ్ చింతల్‌మెట్ నుంచి బెంగళూరు-హైదరాబాద్ NH-44కు అనుసంధానం చేస్తూ తీగల వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీంతో HMDA ప్లాన్ చేస్తోంది. మొత్తం 4 లైన్‌లు, 2.65 KM పొడవు, రెండు చోట్ల ఎంట్రీ ర్యాంపులు, ఒక చోట ఎగ్జిట్ ర్యాంప్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Similar News
News February 15, 2025
HYD: రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు.. వివరణ!

నల్గొండ (D) అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లను వేసినట్లు సోషల్ మీడియా ప్రచారంపై HYD జలమండలి స్పందించింది. ఇక్కడి నుంచి నీరు జంటనగరాలకు సరఫరా అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అయింది. కాగా స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. స్పెషల్ టీం నీటి పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలు లభించలేదని, ఆందోళన అవసరం లేదని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
News February 15, 2025
HYD: 17న KCRపై స్పెషల్ సీడీ: తలసాని

ఈనెల 17న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో కేక్‌కట్ చేసిన అనంతరం కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడీ విడుదల చేస్తామన్నారు.
News February 15, 2025
రంగారెడ్డి: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

రంగారెడ్డి కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.