News April 3, 2024
హైదరాబాద్‌లో మరో మర్డర్

HYDలో మరో దారుణ ఘటన జరిగింది. బహదూర్‌పుర PS పరిధి నందిముస్లాయిగూడలో మహమ్మద్ రషీద్ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షకీల్ అహ్మద్ సోదరిని రషీద్ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం మరోసారి వివాదం తలెత్తింది. ఈ విషయం తెలుసుకొన్న షకీల్ హుటాహుటిన సోదరి ఇంటికి వచ్చాడు. మాటామాటాపెరగడంతో రషీద్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 17, 2025
సిజేరియన్ డెలివరీలపై చర్యలు తీసుకోవాలి: మంత్రి

కోఠిలోని TGMSIDC కార్యాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సరైన కారణాలు లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని, నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవిలో గర్భిణులు, బాలింతల కోసం ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
News April 17, 2025
OU: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News April 17, 2025
21 నుంచి MBA ఇంటర్నల్ పరీక్షలు

ఓయూ పరిధిలో MBA ఇంటర్నల్ పరీక్షలు 21వ తేదిన నిర్వహించనున్నట్లు బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ జహంగీర్ తెలిపారు. MBA నాలుగో సెమిస్టర్ రెండో ఇంటర్నల్ పరీక్షలను 26వ తేదీలోగా, రోజుకు రెండుకు మించకుండా నిర్వహించాలని కళాశాలల నిర్వహకులకు సూచించారు. ఇంటర్నల్ పరీక్షలకు నూతన విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. యాజమాన్యాలకు ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలన్నారు.