News March 19, 2025
హైదరాబాద్‌లో ముంచుకొస్తున్న ముప్పు!

HYDకు ముప్పు ముంచుకొస్తోంది. ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. ORR వరకు 948 చ.కిమీ మేర ఏకంగా 921 చ. కిమీ మేర భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు జలమండలి నివేదికలో వెల్లడైంది. ప్రతిరోజు దాదాపు 11 వేల ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. IT కారిడార్, కూకట్పల్లి, మాదాపూర్, శేరిలింగంపల్లి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది.
Similar News
News February 26, 2026
చర్లపల్లి: ఖైదీలకు నూనె తయారీపై శిక్షణ

చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ(పీఏసీ)లోని ఆయుర్వేద గ్రామంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్‌ను జైళ్ల శాఖ డీజీ డా.సౌమ్య మిశ్రా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని పునః ప్రారంభించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని ఆమె స్పష్టంచేశారు. కార్యక్రమంలో DIGలు శ్రీనివాస్, సంపత్, సూపర్డెంట్లు భరత్ ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
News February 26, 2026
HYDలో కీలక IAS అధికారుల బదిలీ

రాష్ట్రవ్యాప్తంగా IASల బదిలీలు జరిగాయి. ఇందులో GHMCకి జోనల్ కమిషనర్లుగా ఇద్దరు వచ్చారు. రాజేంద్రనగర్ ZC అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా వెళ్లారు. ఆయన స్థానంలో మంద మకరందు ఛార్జ్ తీసుకోనున్నారు. కుత్బుల్లాపూర్ ZCగా పింకేశ్ కుమార్ నియమితులయ్యారు. ZC సందీప్ కుమార్ ఝా జనగామ కలెక్టర్‌గా వెళ్లారు. TGSPDCL సీఎండీని 3వ డిస్కం CMDగా బదిలీచేశారు. కొత్త సీఎండీగా జితేశ్ విపాటిల్ రానున్నారు.
News February 26, 2026
HYD: ఇంటర్ విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్

TGBIE ప్రత్యేకంగా స్టూడెంట్స్ & పేరెంట్స్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు తదితర అంశాలపై మార్గదర్శనం, సందేహాల నివృత్తికి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ తెలిపారు. హెల్ప్‌లైన్ నం. 040-24655027, IVR. No. 9240205555కు కాల్ చేసి విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అవసరమైన సహాయం కోసం వెంటనే సంప్రదించాలని సూచించారు.


