News March 19, 2025
హైదరాబాద్‌లో ముంచుకొస్తున్న ముప్పు!

HYDకు ముప్పు ముంచుకొస్తోంది. ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. ORR వరకు 948 చ.కిమీ మేర ఏకంగా 921 చ. కిమీ మేర భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు జలమండలి నివేదికలో వెల్లడైంది. ప్రతిరోజు దాదాపు 11 వేల ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. IT కారిడార్, కూకట్‌పల్లి, మాదాపూర్, శేరిలింగంపల్లి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది.
Similar News
News April 19, 2025
నేటి నుంచి GMAT స్పెషల్ క్లాసులు

TG: గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(GMAT) వచ్చే నెలలో జరగనుంది. పరీక్ష రాసే అభ్యర్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు నేటి నుంచి స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నట్లు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రోజూ ఉ.8-8.30 వరకు నిపుణ ఛానల్‌లో, సాయంత్రం 6-6.30 వరకు విద్య ఛానల్లో క్లాసులు ప్రసారం చేస్తామని వెల్లడించారు. APRIL 22న ‘వరల్డ్ ఎర్త్ డే’ సందర్భంగా ఉ.11కు ప్రత్యేక లైవ్ పోగ్రామ్ ఉంటుందన్నారు.
News April 19, 2025
ప్రకాశం: వీరిద్దరే దొంగలు.. జాగ్రత్త

ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాళ్లూరు పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా వీళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అనాథాశ్రమానికి సహాయం చేయండంటూ ముందుగా మహిళ తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తుంది. ఆ తర్వాత మరో వ్యక్తికి సమాచారం అందిస్తే అతను దొంగతనం చేస్తాడు. వీరితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
News April 19, 2025
వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం

కాకినాడ జిల్లాలో ఓ మాజీ వైసీపీ ఎమ్మెల్యే గత ప్రభుత్వ హయంలో బ్రాహ్మణ, దేవాదాయ భూములు కాజేశాడని Dy.CM పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఆయన కార్యాలయానికి భూకబ్జాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌లో పేషీ అధికారులతో మాట్లాడారు. కాకినాడ జిల్లా, నగరంలో కబ్జాకు గురైన భూముల గురించి ప్రస్తావించారు. అధికారులు అక్కడికి వెళ్లి విచారించాలని ఆదేశించారు.