News May 11, 2024
హైదరాబాద్‌లో మోదీ చరిష్మా వర్కౌట్ అయ్యేనా?

మోదీ రాకతో ఎల్బీస్టేడియం కాషాయమయమైంది. శుక్రవారం సా. ఆయన రాజధాని పరిధిలోని నలుగురు MP అభ్యర్థులకు మద్దతుగా భాగ్యనగర్ జనసభలో ప్రసంగించారు. INC పాలనలో బాంబ్ బ్లాస్టులు జరిగాయని విమర్శలు గుప్పించారు. BJP హయాంలో నగరంలో ఒక్క బ్లాస్ట్ జరగలేదన్నారు. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమని వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మరి మోదీ చరిష్మా HYDలో వర్కౌట్ అయ్యేనా? మీ కామెంట్?
Similar News
News February 13, 2025
HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దే అని పేర్కొన్నారు.
News February 13, 2025
హుస్సేన్ సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.
News February 13, 2025
HYD: ఎమ్మెల్సీకి నోటీసులు జారీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తోల్కట్ట ఫామ్ హౌస్‌లో కోడిపందేల నిర్వహణ కేసులో నోటీసులు అందజేసినట్లు అధికారుల సమాచారం. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో కోడిపందాల నిర్వహణపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు.