News November 27, 2024
హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు

HYDలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం <<14722224>>జీడిమెట్ల<<>>లోని కంపెనీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు చల్లారకముందే <<14721016>>మణికొండ<<>>, <<14721091>>రామంతాపూర్<<>>లో రెండు సంఘటలు వెలుగుచూశాయి. 2024లో ఇప్పటివరకు HYD, MM, RRలో 1550కి పైగా ప్రమాదాలు జరగడం ఆందోళనకరం. ఇందులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదాలే ఎక్కువ. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Similar News
News November 20, 2025
GHMC బర్త్, డెత్ సర్టిఫికెట్లు వాట్సాప్‌లోనే

మీసేవ వాట్సాప్ ద్వారా GHMC పరిధిలోని 30 సర్కిళ్లలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల వివరాలు అందుబాటులో ఉన్నట్లు ఉప్పల్ మీసేవ కేంద్ర అధికారులు తెలిపారు. డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి 2025 జూన్ రెండో తేదీ వరకు మరణించిన వారి వివరాలు మాత్రమే ఇందులో చూపిస్తున్నట్లుగా వినియోగదారులు తెలిపారు. ప్రజలు 80969 58096 నంబర్ సర్వీస్‌ను వాట్సాప్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 20, 2025
HYD: అర్ధరాత్రి రోడ్లపై తిరిగిన ముగ్గురి యువకుల అరెస్ట్

అర్ధరాత్రి రోడ్లపై కారణం లేకుండా తిరుగుతున్న ముగ్గురు యువకులను టోలీచౌకీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులపై పెట్టీ కేసులు నమోదు చేసి, వారిని 3 – 7 రోజుల రిమాండు విధించారు. ఇకనుంచి ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్లపై తిరగకూడదని ప్రజలను హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు హెచ్చరించారు.
News November 20, 2025
రాజకీయ లబ్ధికోసం KTRపై అక్రమ కేసులు: హరీశ్

HYD బ్రాండ్ ఇమోజీని పెంచిన KTRపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న KTRపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధిపొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.


