News November 15, 2024

హైదరాబాద్‌లో విశాఖ యువకుడి మృతి

image

విశాఖపట్నం మల్కాపురం ప్రాంతానికి చెందిన దేవకుమార్ గురువారం రాత్రి తన స్నేహితునితో బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగింది. ప్రమాదంలో దేవకుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన అతని స్నేహితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. దేవకుమార్ స్నేహితుడు విజయవాడ వాసిగా గుర్తించారు. కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Similar News

News December 9, 2024

విశాఖ-సికింద్రాబాద్ మధ్య సంక్రాంతికి స్పెషల్ ట్రైన్ 

image

సంక్రాంతి సీజన్ దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ(07097/07098) ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఈనెల 15, 22,29 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్(07097/07098) స్పెషల్ విశాఖ నుంచి 16, 23,30 తేదీల్లో నడుస్తాయన్నారు. >Share it

News December 9, 2024

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: బొత్స

image

తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైనట్లు MLC బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ నగరం లాసన్స్‌బే కాలనీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంట నష్టంపై వినతి పత్రం అందజేస్తామన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.

News December 9, 2024

విశాఖ-బనారస్ ఎక్స్‌ప్రెస్ 22న రద్దు

image

విశాఖ-బనారస్ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 22వ తేదీన రద్దు చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. సోరంటోలి చౌక్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 23న బనారస్-విశాఖ ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేశామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.