News April 12, 2024
హైదరాబాద్లో వెదర్ అప్డేట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశాలున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నగరంలో వెదర్ కాస్త చల్లబడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.9 డిగ్రీలు, గాలిలో తేమ 73 శాతంగా నమోదు అయ్యే ఛాన్స్ ఉందని ప్రకటన విడుదల చేసింది. SHARE IT
Similar News
News November 18, 2025
హైదరాబాద్లో భారీగా స్థిరాస్తి విక్రయాలు

గ్రేటర్ HYDలో ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ నాటికి 17,658 స్థిరాస్తులు విక్రయించినట్లుగా స్థిరాస్తి కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ సంస్థ వెల్లడించింది. గతేడాది ఇదే టైమ్లో జరిగిన విక్రయాలతో పోలిస్తే 53% ఎక్కువ అని వెల్లడించింది. హైదరాబాద్ తర్వాత గిరాకీ అధికంగా ఉన్న నగరాల్లో బెంగళూరు, చెన్నై ఉన్నట్లు పేర్కొంది.

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: సీఎం

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా అప్పటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్ని కోరుతున్నామన్నారు.