News April 12, 2024
హైదరాబాద్‌లో వెదర్ అప్‌డేట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశాలున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నగరంలో వెదర్ కాస్త చల్లబడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.9 డిగ్రీలు, గాలిలో తేమ 73 శాతంగా నమోదు అయ్యే ఛాన్స్ ఉందని ప్రకటన విడుదల చేసింది. SHARE IT
Similar News
News March 19, 2025
HYD గురించి చెప్పాలనుకుంటున్నారా?

స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే మొదలైంది. దేశంలోని వివిధ నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అవార్డులు అందజేస్తోంది. ఈ సర్వేలో ప్రజలు పాల్గొని తమ నగరం గురించి అభిప్రాయాలు చెప్పవచ్చు. https ://sbmurban.org/feedback వెబ్‌సైట్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. సర్వేలో పాల్గొనేందుకు ఈనెల 31 వరకు మాత్రమే అవకాశం. ఇప్పటికే దాదాపు 14వేల మంది నగరవాసులు సర్వేలో పాల్గొన్నారు. మరి ఇంకెందుకాలస్యం.. మీరు కూడా పాల్గొనండి.
News March 19, 2025
ఓయూ లా కోర్సుల పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్, ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకాం ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, ఎల్ఎల్ఎం మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
News March 18, 2025
ఈడీ వద్దకు చేరిన బెట్టింగ్ యాప్స్ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. 11 మంది వివరాలు సేకరించి.. ఎవరెవరికి ఎంత డబ్బులు ముట్టాయని ఈడీ ఆరా తీస్తోంది.