News July 12, 2024
హైదరాబాద్లో సొరంగ మార్గం కష్టం.?

HYDలో టన్నెల్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45, KBR పార్కు కింద నుంచి 6.30 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇందుకు రూ. 3 వేల కోట్లు అవుతుందని ఓ ఏజెన్సీ జీహెచ్ఎంసీకి నివేదిక సమర్పించింది. దీనికి తోడు జూబ్లీహిల్స్ రోడ్ నం. 2లో భూసేకరణ కొంత కష్టమేనని అధికారులు చెబుతున్నారు. టన్నెల్ నిర్మాణంపై ముందుకు వెళుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Similar News
News November 17, 2025
హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.

గ్రేటర్ చెరువులకు హైడ్రా అండ.. త్వరలో బాధ్యతలు ?

మహానగరంలో పలు చెరువులు కబ్జా కావడంతో వాటిని పరిరక్షించేందుకు హైడ్రా నడుంబిగించింది. ఈ క్రమంలో చెరువుల బాధ్యతను మొత్తం హైడ్రాకు అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. చెరువులను కాపాడటంతో పాటు అభివృద్ధి కూడా హైడ్రా చేతుల్లో పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. GHMCలో చెరువుల పరిరక్షణకు సిబ్బంది సమస్య ఉండటంతో ఈ ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఇద్దరు కమిషనర్లు సమావేశం కానున్నట్లు తెలిసింది.