News March 9, 2025
హైదరాబాద్‌లో 4 రోజులు అసెస్మెంట్ క్యాంప్

ఆలింకో సంస్థ ఆధ్వర్యంలో SBI సౌజన్యంతో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా HYDలో ప్రత్యేక అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించనున్నారు. మార్చి 10న అంబర్పేట్, 11న సికింద్రాబాద్ బోలక్పూర్, 12న ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్, 13న సీతాఫల్మండిలో దివ్యాంగులకు ఉపకరణాలు ఇవ్వనున్నారు. ఉ.10 నుంచి సా.4 వరకు కొనసాగనున్నాయి. అర్హులు 40% పైగా దివ్యాంగ ధ్రువపత్రం, ఆదాయ, ఆధార్, UDIDతో వచ్చి వినియోగించుకోవాలని కలక్టర్ కోరారు.
Similar News
News October 27, 2025
ఖమ్మంలో క్లాక్ టవర్.. స్పెషాలిటీ ఇదే

ఖమ్మానికి కొత్తశోభ రానుంది. నగరంలోని ఇల్లందు క్రాస్‌రోడ్‌లో రూ. 1.25కోట్లతో క్లాక్ టవర్ నిర్మించనున్నారు. నిర్మాణానికి ప్రపంచగుర్తింపు పొందిన బ్లాక్ గ్రానైట్ రాయిని ఉపయోగించడంతో పాటు స్తంభాద్రి నరసింహస్వామి, ఖిల్లా, ఇతర చారిత్రక అంశాలు ప్రతిబింబించేలా రూపకల్పన చేయనున్నారు. ఈ టవర్ నిర్మాణం పూర్తయితే నగరానికి ల్యాండ్ మార్క్‌గా నిలవనుంది. ఇప్పటికే నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
News October 27, 2025
జూబ్లీహిల్స్‌లో BJP ‘కార్పెట్ బాంబింగ్’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రేపు కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాజస్థాన్ సీఎం, తదితరులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
News October 27, 2025
జూరాల ప్రాజెక్టు తాజా నీటి వివరాలు

జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.275 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. ఇన్ ఫ్లో 25 వేల క్యూసెక్కులు కాగా, పవర్ హౌస్‌లకు 23,558 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్ ఫ్లో 23,105 క్యూసెక్కులుగా ఉందన్నారు. వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు అన్ని గేట్లను నిలుపుదల చేశారు.


