News April 9, 2024
హైదరాబాద్‌లో BRS లీడర్‌కు తప్పిన ప్రమాదం

HYDలో BRS లీడర్‌కు ప్రమాదం తప్పింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ఖైరతాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తన మిత్రుడిని పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో (కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలో) టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి మెట్రో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఎయిర్‌బెలూన్స్ ఓపెన్ కావడంతో పల్లె రవి, డ్రైవర్ ఖదీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Similar News
News March 24, 2025
ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News March 24, 2025
రంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు ఇలా..

రంగారెడ్డి జిల్లాలో ఆదివారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కాసులాబాద్లో 37.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళ్‌పల్లిలో 36.6℃, హస్తినాపురం, ఎలిమినేడు 36.3, చుక్కాపూర్ 36.2, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, దండుమైలారం 35.7, చందానవెల్లి 35.4, మొగల్గిద్ద, వైట్‌గోల్డ్ SS 35.3, తొమ్మిదిరేకుల 35.1, అలకాపురి, గచ్చిబౌలి, మియాపూర్ 35.1, షాబాద్, కేతిరెడ్డిపల్లిలో 35℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 24, 2025
GHMCలో 27 మంది ఇంజినీర్ల తొలగింపు

GHMC కమిషనర్ ఇలంబర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. GHMC టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న న్యాక్ అవుట్ సోర్సింగ్ 27 మంది ఇంజినీర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణ, అక్రమాలకు పాల్పడుతున్నవారితో చెడ్డపేరు వస్తుందని, వీరిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. కొంతకాలంగా గ్రేటర్లో ఆక్రమణలపై ఇంజినీర్లు తనిఖీలు చేయకపోవడం, చేసినా చర్యలు తీసుకోకపోవడంతో తొలగించినట్లు తెలిపారు.