News July 14, 2024
హైదరాబాద్లో NDRF బృందాలను దించండి: దాన కిషోర్

నగరంలోని వర్ష ప్రభావ ప్రాంతాల్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ పర్యటించారు. నగరంలోని శేరిలింగంపల్లి, ఖైరతాబాద్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాలైన దుర్గంచెరువు, నెట్రన్ గార్డెన్కు వెళ్లారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలన్నారు.
Similar News
News December 5, 2025
HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

గ్రేటర్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.
News December 5, 2025
HYD: ‘మెట్రో’ భూములు ఏమయ్యాయి?

మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా అప్పటి ప్రభుత్వం మెట్రోకు 57 ఎకరాలను కేటాయించింది. మెట్రో అధికారులు మాత్రం కేవలం 18 ఎకరాలను మాత్రమే వినియోగించారు. మూసారంబాగ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మాదాపూర్లో మాత్రమే మాల్స్ కట్టి మిగతా 39 ఎకరాలను వదిలేసింది. ఇపుడు ఈ స్థలాలను ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వాటిని వాడుకోలేదని తెలుసుకునే పనిలో పడ్డారు.
News December 5, 2025
OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.


