News March 20, 2025

హైదరాబాద్‌లో OYO 2.O!

image

HYDలో OYOకు డిమాండ్‌ పెరిగింది. ఇటీవల సర్వేలోనూ నిజమని తేలింది. పాతబస్తీ గల్లీల నుంచి ORR వరకు ఓయోలే దర్శనమిస్తున్నాయి. చిన్న.. చిన్న లాడ్జీలను సైతం ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. రూ.500కే గదులను అద్దెకు ఇవ్వడంతో జనం క్యూ కడుతున్నారు. హోటళ్లు, గదులను లగ్జరీగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చిల్ అవ్వాలని యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో HYDలో OYO కొత్తపుంతలు తొక్కుతోంది.

Similar News

News March 28, 2025

తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక: కేటీఆర్

image

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్దనగర్ డివిజన్‌లోని వారసిగూడలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కే.టీ.రామారావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు సర్వ మత సౌభ్రాతృత్వాన్ని చాటుతాయని అన్నారు. తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీకని చెప్పారు.

News March 28, 2025

HYDలో LRSకు నో ఇంట్రెస్ట్ !

image

జీహెచ్ఎంసీ పరిధిలో LRS ఫీజు చెల్లించేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గ్రేటర్ పరిధిలో 1,07,865 మంది LRSకు దరఖాస్తు చేసుకున్నారు. ఫీజు చెల్లించేందుకు గడువు కూడా ఈనెల 31తో ముగియనుంది. 58,523 మందికి ఫీజు లెటర్లు జారీ అయ్యాయి. వారిలో కేవలం 5,505 మంది ఫీజు చెల్లించారు. వీరి ద్వారా రూ.69 కోట్లు సమకూరాయి. మరి ఈ నాలుగు రోజుల్లో ఎంతమంది ఉపయోగించుకుంటారో చూడాలి.

News March 28, 2025

HYDలో నీటి ఎద్దడికి ఈ ఫొటో నిదర్శనం

image

ఈ దృశ్యం HYD శివారు మేడ్చల్‌లోని మూడుచింతలపల్లిలో నీటి ఎద్దడికి నిదర్శనం. మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ రాకపోవడంతో అక్కడ నివసించే మహిళలు కాలినడకన చిన్నపిల్లలతో సహా బిందెలు, డబ్బాలతో దూరప్రాంతాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఏడాది నుంచి ఈ సమస్య ఇలాగే ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు తమ గోడు వినిపించదా మమ్మల్ని పట్టించుకోరా? అని మండిపడుతున్నారు.

error: Content is protected !!