News March 20, 2025

హైదరాబాద్‌లో OYO 2.O!

image

HYDలో OYOకు డిమాండ్‌ పెరిగింది. ఇటీవల సర్వేలోనూ నిజమని తేలింది. పాతబస్తీ గల్లీల నుంచి ORR వరకు ఓయోలే దర్శనమిస్తున్నాయి. చిన్న.. చిన్న లాడ్జీలను సైతం ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. రూ.500కే గదులను అద్దెకు ఇవ్వడంతో జనం క్యూ కడుతున్నారు. హోటళ్లు, గదులను లగ్జరీగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చిల్ అవ్వాలని యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో HYDలో OYO కొత్తపుంతలు తొక్కుతోంది

Similar News

News March 25, 2025

మేడ్చల్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

image

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 25, 2025

HYD: ఓయూలో విధించిన ఆంక్షలపై వాయిదా తీర్మానం

image

ఓయూలో విధించిన ఆంక్షలపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. విద్యార్థుల ర్యాలీలు, ధర్నాల నిషేధంపై చర్చ కోరుతూ పార్టీ సభ్యులు అసెంబ్లీ కార్యదర్శికి వాయిదా తీర్మానం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం అందించారు.

News March 25, 2025

MMTS అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

image

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

error: Content is protected !!