News March 20, 2025

హైదరాబాద్‌లో OYO 2.O!

image

HYDలో OYOకు డిమాండ్‌ పెరిగింది. ఇటీవల సర్వేలోనూ నిజమని తేలింది. పాతబస్తీ గల్లీల నుంచి ORR వరకు ఓయోలే దర్శనమిస్తున్నాయి. చిన్న.. చిన్న లాడ్జీలను సైతం ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. రూ.500కే గదులను అద్దెకు ఇవ్వడంతో జనం క్యూ కడుతున్నారు. హోటళ్లు, గదులను లగ్జరీగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చిల్ అవ్వాలని యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో HYDలో OYO కొత్తపుంతలు తొక్కుతోంది

Similar News

News November 17, 2025

శుభ సమయం (17-11-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ త్రయోదశి తె.5.09 వరకు
✒ నక్షత్రం: చిత్త తె.5.20 వరకు
✒ శుభ సమయాలు: సా.7.45-8.10.
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు, మ.2.46-3.34
✒ వర్జ్యం: మ.12.04-1.40
✒ అమృత ఘడియలు: రా.10.49-12.31

News November 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 17, 2025

పెద్దపల్లి: అన్నను కలిసి వెళ్తుండగా అనంతలోకాలకు

image

సెలవురోజు కావడంతో అన్నను కలవడానికి వచ్చిన బాలికను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. SI శ్రావణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్(M) తోంగూర్‌కు చెందిన దాట శివాసిని(8) అన్న దాట శ్రావణ్ సుల్తానాబాద్లోని గురుకులంలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలకు వచ్చింది. అన్నను కలిసి తిరిగెళ్తుండగా బొలెరో ట్రాలీ ఢీకొనడంతో చనిపోయింది.