News March 20, 2024
హైదరాబాద్లో TAX కట్టకుంటే LOCK..!

ఏళ్లుగా ప్రాపర్టీ TAX కట్టని వారిపై GHMC చర్యలకు సిద్ధమైంది. మొండి బకాయిల వసూలే లక్ష్యంగా పెట్టుకొన్న అధికారులు.. తొలుత వ్యాపారసముదాయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 100కు పైగా దుకాణాలకు తాళం వేశారు. ఇటువంటి వారి కోసం OTS(వన్ టైమ్ సెటిల్మెంట్) స్కీమ్ అమల్లో ఉందని గుర్తుచేస్తున్నారు. MAR 31లోపు చెల్లిస్తే 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. పన్ను కట్టని నిర్మాణాలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Similar News
News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
News November 19, 2025
HYD: ‘డ్రగ్స్ వద్దు.. కెరీర్ ముద్దు’

డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి జోలికి వెళ్తే జీవితం అగమ్య గోచరంగా మారుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవాల సందర్భంగా మెడికల్ విద్యార్థులకు డ్రగ్స్పై అవేర్నెస్ కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, ఐఏఎస్ అధికారి అనిత రామచంద్రన్, టీ న్యాబ్ అధికారులు పాల్గొన్నారు.
News November 18, 2025
సీఎం ప్రజావాణిలో 298 దరఖాస్తులు

ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 298 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 90, రెవెన్యూ శాఖకు 54, ఇందిరమ్మ ఇండ్ల కోసం 90, మున్సిపల్ శాఖకు 17, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 45 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వెల్లడించారు.


