News March 20, 2024

హైదరాబాద్‌‌లో TAX కట్టకుంటే LOCK..!

image

ఏళ్లుగా ప్రాపర్టీ TAX కట్టని వారిపై GHMC చర్యలకు సిద్ధమైంది. మొండి బకాయిల వసూలే లక్ష్యంగా పెట్టుకొన్న అధికారులు.. తొలుత వ్యాపారసముదాయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 100కు పైగా దుకాణాలకు తాళం వేశారు. ఇటువంటి వారి కోసం OTS(వన్‌ టైమ్ సెటిల్‌మెంట్‌) స్కీమ్ అమల్లో ఉందని గుర్తుచేస్తున్నారు. MAR 31లోపు చెల్లిస్తే 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. పన్ను కట్టని నిర్మాణాలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Similar News

News September 21, 2024

నాంపల్లి: HWO జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల

image

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(HWO) జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసినట్లు TGPSC అధికారులు తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tspsc.cgg.gov.in నుంచి లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని, తమ ర్యాంక్ చూసుకోవచ్చని తెలిపారు. కాగా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBRT) విధానంలో జూన్ 24 నుంచి జూన్ 29 వరకు పరీక్షలు నిర్వహించి, జులై 18న ప్రాథమిక కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

News September 20, 2024

HYD: వ్యభిచారం చేస్తూ 2వ సారి దొరికారు!

image

వ్యభిచారం కేసులో పట్టుబడి జైలుకెళ్లొచ్చినా ఆ ఇద్దరి బుద్ధి మారలేదు. మళ్లీ దందా మొదలుపెట్టారు. CYB AHTU వివరాలు.. అల్లాపూర్ PS పరిధి గాయత్రినగర్‌‌లోని ఓ అపార్ట్‌మెంట్‌(102)లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందింది. సాయంత్రం రైడ్స్ చేసి ఆర్గనైజర్‌ వంశీకృష్ణ, పార్వతి, విటుడిని అరెస్ట్ చేశారు. వంశీకృష్ణపై గతంలోనే పిటా కేసు నమోదైంది. మహిళ కూడా వ్యభిచారం కేసులో జైలుకెళ్లివచ్చినట్లు పోలీసులు తెలిపారు.

News September 20, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెండు జాతీయ అవార్డులు

image

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్‌ అధికారులు తెలిపారు. భారత పరిశ్రమ సమాఖ్య సీఐఐ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించిన ఎక్సలెన్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమంలో నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌ అవార్డులు దక్కినట్లు చెప్పారు. వరుసగా ఆరోసారి నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ అవార్డు దక్కినట్లు తెలిపారు.