News September 7, 2024

హైదరాబాద్ అంతా NIGHT OUT

image

వినాయక చవితి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో యువత నైట్ అవుట్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఏ వీధిలో చూసినా యువకులు మండపాలు వేయడం, డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు నాగోల్, ధూల్‌పేట్‌కు పోటెత్తారు. మరోవైపు పలు చోట్ల పండుగ సామగ్రి విక్రయ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండడంతో సందడి నెలకొంది. వినాయక చవితి తమకు స్పెషల్ ఫెస్టివల్ అని యువకులు తెలిపారు.

Similar News

News October 9, 2024

HYD: బస్సులు, రైళ్లు FULL.. వామ్మో కష్టమే..!

image

హనుమకొండ, వరంగల్, తొర్రూరు, ఖమ్మం సహా ఇతర ప్రాంతాలకు HYD నగరం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వెళ్తున్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో సాయంత్రం వేళ రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. కనీసం కూర్చునే పరిస్థితి లేదని ప్రయాణికులు వాపోయారు. రైళ్లలో వెళ్తున్న వారు ప్రతి స్టేషన్‌లో దిగి మళ్లీ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News October 9, 2024

ఖైరతాబాద్: సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై కమిషనర్ సమావేశం

image

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM) కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)ని ప్రవేశపెట్టనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. బుధవారం 11 మంది ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు పెంచడానికి చురుకైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ఆపరేటర్లు అందించిన వినూత్న సాంకేతికతలను సమావేశంలో పరిశీలించారు.

News October 9, 2024

HYD: భర్త బయటపెట్టిన వీడియోలపై స్పందించిన దివ్యజ్యోతి

image

HYD మణికొండ డీఈఈ దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె నిత్యం లంచం తీసుకుంటుందని పేర్కొంటూ.. నోట్ల కట్టలతో కూడిన వీడియోలను రిలీజ్ చేశారు. దీనిపై దివ్యజ్యోతి స్పందించారు. తాము గత సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు. కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని వెల్లడించింది. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.